Latest Posts

బీవీఎస్ ర‌వి – చిరంజీవి – ఠాగూర్ టు వస్తుందా..?

- Advertisement -

Megastar Chiranjeevi Next Movie: చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అందరూ సీనియర్ హీరో లు కూడా ఆరుపదుల వయసులో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. బాలకృష్ణ అలాగే చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండగా నాగార్జున అలాగే వెంకటేష్ నెమ్మదిగా తమ కెరియర్ ని కొనసాగిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంబరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేద్దామని ఆ తర్వాత పోస్ట్ ఫోన్ చేశారు. విశ్వంభరా సంక్రాంతికి కాకుండా సమ్మర్లో విడుదల కావడంతో చిరంజీవి తదుపరి సినిమా ఏది అనే విషయంలో క్లారిటీ లేకుండా ఉంది.

దర్శకుడు అలాగే రైటర్ బివిఎస్ రవి (BVS Ravi) లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు రోజుల క్రితం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి (chiranjeevi) గారికి కథ చెప్పాను.. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉందంటూ చెప్పుకు రావటం జరిగింది.. అయితే ఈ సినిమాకి అతను దర్శకుడు కాదంట.. మోహన్ రాజా తో కలిసి పనిచేస్తున్నట్టు వివరించారు..

- Advertisement -

అయితే మాకు అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఠాగూర్ లాగా అన్ని కమర్షియల్ హంగులతో బలమైన సోషల్ మెసేజ్ ఉంటుందని తెలుస్తుంది.. ఇదే విషయాన్ని బివిఎస్ రవి కూడా నిర్ధారించారు.. చిరంజీవి లాంటి పెద్ద హీరో డాన్సులు డైలాగులు చెప్పే సినిమాలు చాలానే చేశారు.. కానీ ఒక మంచి మెసేజ్ ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే చిరంజీవి లాంటి స్టార్స్ కే అది సాధ్యమవుతుంది అందుకనే తాను అలాంటి కథనే రాశానంటూ చెప్పారు.. చిరంజీవి గారి విశ్వంబర సినిమా తర్వాత త‌మ సినిమానే మొద‌ల‌వుతుంద‌ని కూడా డిక్లేర్ చేశారు.

అయితే చిరంజీవికి సంబంధించిన టీం మాత్రం తన తదుపరి సినిమాపై ఎటువంటి క్లారిటీ లేదని అలాగే రవి గారి స్టోరీ కూడా లైన్ లో ఉంది అంటూ చెప్పటం జరిగింది.. మరి దీనిపై అఫీషియల్ గా అప్డేట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి..

BVS Ravi Confirmed Next Movie With Chiranjeevi – Chiranjeevi Upcoming movie news, Vishwambhara Release date, Mohan Raj and Chiranjeevi next movie details, Chairanjeevi 2025 movies list

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles