cab driver arrested for harassing on bengali actress mimi chakraborty

Mimi Chakraborty: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాలీ నటి మిమి చక్రవర్తిని వేధించిన ట్యాక్సీ డ్రైవర్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి డ్రైవర్ తనను వేధించినట్లు నటి ఫిర్యాదు చేశారు. బెంగాలీ హీరోయిన్, లోక్‌సభ ఎంపీ మిమి చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది.

ఈమె తన కారులో సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోల్‌కతాలోని గరియాహాట్ నుంచి బాలిగంజ్ వైపు వెళుతుండగా.. మధ్యలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆమె కారు ఆగింది. ఇంతలో ఓ టాక్సీడ్రైవర్.. మిమి చక్రబర్తి కొరక్కు తినేసాలా చూసాడు. అంతేకాదు మిమీని చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి ఆమెను లైంగికంగా ఇబ్బందులకు గురిచేసాడు.

ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌‌కతా నగరంలోని బలీగుంగే ఫారీ ప్రాంతంలో జరిగింది. అనేక బెంగాలీ సినిమాల్లో నటించిన మిమి చక్రవర్తి గత లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున జాదవ్‌పూర్ నియోజవర్గం నుంచి గెలుపొందారు. బెంగాళీ దర్శకుడు కమలేశ్వర్ రూపొందించిన షో త్వరలోనే ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే మిమిని ఉద్దేశించి టాక్సీ డ్రైవర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెను ట్రోల్ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో మిమి చక్రబర్తి షాక్ కు గురైంది. దీంతో వెంటనే తేరుకున్న మిమీ చక్రబర్తి వెంటనే కారు దిగి ఆ టాక్సీ ట్రైవర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో సదురు టాక్సీ డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత మిమి చక్రబర్తి.. ఆ టాక్సీ నెంబర్ ఆధారంగా స్ఠానిక గరియా హాట్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్ పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి టాక్సీ నెంబర్‌తో పాటు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా సదురు టాక్సీ డ్రైవరు‌ను పోలీసులు అరెస్ట్ చేసారు.