clash betweem Sye Raa Narasimha Reddy vs War vs Joker movies
clash betweem Sye Raa Narasimha Reddy vs War vs Joker movies

‘సైరా’ చిత్రం పై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల నిరసన తీవ్ర రూపం దాల్చింది. సినిమా మొదట్లో నిర్మాత రామ్ చరణ్ ఉయ్యాలవాడ వారసులమైన తమ వద్ద నుండి కథను, అనేక ఇతర వివరాలను తీసుకుని 23 మంది కుటుంబ సభ్యులకు రూ.50 కోట్లు ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత అగ్రిమెంట్ కూడా ఇచ్చారని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ నందు చిరంజీవి, చరణ్ మీద నరసింహారెడ్డి వారసులు కోర్టులో పిటిషన్ వేశారు. ‘సైరా’కు సెన్సార్ సర్టిఫికెట్ జారీని, చిత్ర విడుదలను నిలిపివేయాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా గురువారం ఈ పిటిషన్ విచారణకు రాగా చిత్రానికి ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని సెన్సార్ బోర్డ్ తెలిపిందట. దీంతో కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఏది ఏమైనా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది ఈ వివాదం మరింత ముదురుతూ వెళుతోంది.

గతంలో చిరంజీవి ఇంటి ముందు, ఆఫీస్ ముందు ధర్నాకు దిగితే తమ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మరి ఈ వివాదాన్ని చరణ్ అండ్ టీమ్ ఎలా ముగిస్తారో చూడాలి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ఐదు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీస్థాయి అంచనలున్నాయి. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.