డ్రగ్స్ కేసు: ప్రముఖ యాంకర్ కు నోటీసులు

0
638
ccb issues notice to anchor anu sree regarding drugs racket

Anushree: Drugs Racket: ఓ వైపు బాలీవుడ్ మరోవైపు శాండిల్‌వుడ్ డ్రగ్స్ ప్రకంపనలతో వణికిపోతోంది. కర్ణాటకలో వెలుగుచూసిన శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ హీరోయిన్లు రాగిణి ద్వివేది సంజనలు అరెస్ట్ అయ్యారు. తాజాగా డ్రగ్స్ రాకెట్‌లో ఫేమస్ కన్నడ యాంకర్ అనుశ్రీ పేరు బయటకురావడం కలకలం సృష్టిస్తోంది.

కన్నడ నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ తర్వాత డ్రగ్స్ ఇష్యూ ఊహించని మలుపులు తిరుగుతోంది. డ్రగ్స్ రవాణా కేసులో డ్యాన్సర్ కిశోర్ శెట్టిని మంగళూరు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. అనుశ్రీకి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు చెప్పినట్టు తెలిసింది. అందుకే ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. దీంతో ఈ డ్రగ్స్ మూలాలు టీవీ ఇండస్ట్రీకి కూడా పాకాయి.

గతంలో పలు పార్టీల్లో అనుశ్రీ డ్రగ్స్ తీసుకుందని కిషోర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా పాపులర్ యాంకర్ పేరు బయటకురావడంతో ఈ డ్రగ్స్‌ బాగోతం మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళూరుకు చెందిన అనుశ్రీ టీవీ యాంకర్‌గా రాణించడంతో పాటు సినిమాల్లో నటిస్తూ బెంగళూరులో స్థిరపడింది. కన్నడ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె భారీ పారితోషికం అందుకుంటోంది. కాగా తనకు నోటీసులు అందడంపై అనుశ్రీ స్పందించింది. 10 ఏళ్ల కిందట కిశోర్ శెట్టితో కలిసి డ్యాన్స్ చేశానని.. అంతే తప్ప అతడితో నాకు అంత పరిచయం ఏమీ లేదని ఆమె తెలిపింది.