వర్మ సినిమాను విడుదల చేసుకోమని చెప్పిన సెన్సార్ బోర్డు

0
162
Censor marks Ram Gopal Varma Beautiful only for Adults
Censor marks Ram Gopal Varma Beautiful only for Adults

వర్మ సినిమాకు దర్శకత్వం వహించినా.. వర్మ బ్యానర్ లో సినిమా వచ్చినా.. సెన్సార్ వాళ్లకు పెద్ద చిక్కే..! ఒకవేళ సినిమాలో కట్స్ చెప్పారనుకోండి సెన్సార్ వాళ్ళను ఓ ఆట ఆడేసుకుంటాడు వర్మ. ఎన్నో సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు కనీసం రిలీజ్ దక్కలేదు. సెన్సార్ వాళ్ళు తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేశారు. ఇలాంటి తరుణంలో సెన్సార్ కు వచ్చిన వర్మ మరో సినిమా సింగిల్ కట్ లేకుండా సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేశారట. ఇంతకూ ఆ సినిమా ఏమిటనే కదా ‘బ్యూటిఫుల్’ సినిమా గురించి. వర్మ నిర్మాణంలో ‘బ్యూటీఫుల్’ (ట్రిబ్యూట్ టు రంగీలా) అనే సినిమా తెరకెక్కింది. నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సూరి హీరోగా నటించాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను వర్మతో కలిసి దర్శకత్వం వహించిన అగస్త్య మంజు ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. తాజాగా సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఒక్క కట్ లేకుండా ‘A’ సర్టిఫికేట్ జారీ చేసింది.

ఇదంతా ఒక ఎత్తైతే ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విషయంలో వర్మ కాంపౌండ్ తెగ టెన్షన్ పడుతోంది. ఎందుకంటే అనుకున్న సమయానికి సినిమా విడుదల కాలేదు. సెన్సార్ వాళ్ళు ఈ సినిమాను చూసి షాక్ తిన్నారంటే ఎంతమందిని కెలికాడో వర్మ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు.. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, వివాదాస్పద అంశాలున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రముఖులను కించపరిచే సన్నివేశాలు ఉన్న కారణంగా ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. అంతేకాకుండా కొందరు నాయకుల దగ్గర నుండి క్లీన్ చిట్ తీసుకొని రమ్మని చెప్పారంటూ వస్తున్న వార్తలు కూడా కలవరపెడుతున్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం చూసినప్పుడు ఈ సినిమా ఐడియా వచ్చిందని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ మెసేజ్‌ ఓరియంటెడ్ సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ. ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపించటం లేదనీ.. కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేసుకున్నానన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here