‘చావుకబురు చల్లగా’ మూవీ రివ్యూ

460
Lavanya Tripathi Chaavu Kaburu Challaga Movie Review Rating

Chaavu Kaburu Challaga Movie Review in Telugu
విడుదల తేదీ : మార్చి 19, 2021
రేటింగ్ : 2.75/5
నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళీ శర్మ, భద్రం
దర్శకత్వం : పెగళ్ళపాటి కౌశిక్
నిర్మాత‌లు : బన్నీ వాసు, అల్లు అరవింద్
సంగీతం : జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ : కర్మ్ చావ్లా
ఎడిటింగ్ : జి. సత్య

‘ఆర్.ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు కార్తికేయ. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు అంతగా మ్యాజిక్ చేయలేకపోయాయి. అందుకే ఇప్పుడు ‘చావుకబురు చల్లగా’ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ రోజే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా తో కార్తికేయ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? అసలు ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం..

కథ:
బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను మోసుకెళ్లే వాహన డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సిటీలో ఎవరైనా చనిపోతే తన వాహనంలో స్మశానికి తీసుకెళ్లి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో భర్తను కొల్పోయిన యువతి మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. అంత్యక్రియల సమయంలోనే మల్లికను పెళ్లి చేసుకుంటానని వారి బంధువుల ముందే చెప్తాడు. సీన్ కట్ చేస్తే టీవీలు రిపేరు చేసే మోహన్‌(శ్రీకాంత్‌ అయ్యంగార్‌)తో తన తల్లి గంగమ్మ చనువుగా ఉండటం బాధపడతాడు. తన తల్లికంటే భర్తను కోల్పోయిన మల్లిక చాలా గొప్పది అని భావిస్తాడు. అసలు గంగమ్మ మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉంది? భర్తను కోల్పోయిన మల్లిక ప్రేమను బస్తీ బాలరాజు ఎలా దక్కించుకున్నాడు? అన్నదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి, పాటలు,సెకండాఫ్‌. తన నటనతో సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లాడు కార్తీకేయ. చక్కని ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు. భర్తను కోల్పోయిన మల్లిక పాత్రలో లావణ్యత్రిపాఠి అద్భుతంగా నటించింది. గంగమ్మ పాత్రకు ప్రాణం పోసింది ఆమని. సినిమాలో కీ రోల్‌గా ఉన్న ఆమని కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. మిగితా నటీనటుల్లో మురళీశర్మ , శ్రీకాంత్‌ అయ్యంగార్‌, భద్రం పర్వాలేదనిపించారు.

Chaavu Kaburu Challaga Review and Rating In Telugu

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ఎమోషన్ పాయింట్ కానీ సున్నితమైన కథాంశం కానీ చాలా సున్నితంగా బాగుంటాయి. అలాగే సినిమాలో మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి కూడా కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. కొన్ని సన్నివేశాలు అయితే ఒకింత విచిత్రంగా అనిపిస్తాయి. అలాగే మెయిన్ లీడ్ నడుమ కెమిస్ట్రీ జెనరేట్ చేసేందుకు ఇంకా మంచి కథనం అల్లి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. వీటితో పాటుగా మరో మైనస్ ఏమిటంటే లావణ్య రోల్ ను ఒక సింపుల్ అండ్ సీరియస్ రోల్ లో డిజైన్ చేసుకున్న దర్శకుడు ఒక స్టేజ్ లో సింపుల్ గా పలచబడినట్టు చూపించేసారు.

సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. జోక్స్ బిజోయ్ సంగీతం బాగుంది. సినిమాలోని పాటలు అలరించడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Chaavu Kaburu Challaga Movie Review in Telugu

తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే ఈ “చావు కబురు చల్లగా” లోని కనిపించే కథ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాగే కార్తికేయ సాలిడ్ పెర్ఫామెన్స్ లావణ్య త్రిపాఠి రోల్ అలాగే ఈ చిత్రంలో కీలక ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పుట్టిన ప్రతి మనిషి ఎదో ఒక రోజు చావక తప్పదు. అలా అని చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి రోజు బాధపడాల్సిన అవసరంలేదు..చనిపోయినవారిని ఎలాగో తీసుకురాలేము.

ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంతో దర్శకుడు మెప్పించాడనే చెప్పాలి. కానీ కొన్ని రొటీన్ బోరింగ్ సన్నివేశాలు అక్కడక్కడా డల్ గా సాగే కథనం ఈ సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి. మరి ఈ చిత్రంపై మరీ అన్ని అంచనాలు పెట్టుకోకుండా అయితే ఈ వారాంతంలో ఒక ఛాయిస్ గా ఇది నిలుస్తుంది.