కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్

411
Chaavu Kaburu Challaga - Official Trailer | Kartikeya, Lavanya Tripathi | Koushik | CKCTrailer​
Chaavu Kaburu Challaga - Official Trailer | Kartikeya, Lavanya Tripathi | Koushik | CKCTrailer​

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా చావు కబురు చల్లగా. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా కనిపిచంనున్నారు. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.

 

ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వరుసగా పాటలను విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ‘పైన పటారం.. లోన లొటారం’ అనే పాట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్‌లు, పాటలు, టీజర్ అన్నీ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని అధికం చేశాయి.

 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేసారు.ట్రైలర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది.  ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.