- చంద్రముఖి 2 రిలీజ్ డేట్
- చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2
- లారెన్స్ చంద్రముఖి 2 వినాయక చవితికి గ్రాండ్ గా విడుదల
Chandramukhi 2 Release Date: హారర్ జోనర్ లో చంద్రముఖి క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఏదో ఒక రూపంలో ఆన్లైన్లో కనిపిస్తూనే ఉంటాయి. రజనీకాంత్, జ్యోతిక, నయనతార ,నాజర్ తదితరులు నటించిన ఈ చిత్రం ఓ సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆ మూవీకి కంటిన్యూవేషన్ గా వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి చిత్రం చంద్రముఖి రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోయింది.
Chandramukhi 2 Release Date: ఈ మూవీ కి 30 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 1993 లో మణిచిత్రతాఝు మూవీ ఇప్పటికీ పలు భాషలలో రీమేక్‌లు జరుగుతూనే ఉంది. మొదటిసారిగా ఈ మూవీ 2004 లో ఆప్తమిత్ర అని కన్నడ లాంగ్వేజ్ లో వచ్చింది ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చంద్రముఖి మూవీ 2005 లో తమిళ్ మరియు తెలుగు లో రీమేక్ చేయబడింది. ఇక ఆ తర్వాత 2005 లో బెంగాలీలో రాజ్‌మొహోల్ మరియు 2007 లో హిందీ లో భూల్ భులైయా. హిందీ లో ఈ మూవీ కి సీక్వెల్ భూల్ భూలయ్యా 2 గత సంవత్సరం విడుదల అయ్యి మంచి హిట్‌లలో ఒకటిగా నిలిచింది.
అయితే ఇప్పుడు తాజాగా చంద్రముఖి వచ్చి 18 సంవత్సరాలు గడుస్తున్న ఈ సమయంలో చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 లేటెస్ట్ హారర్ త్రిల్లింగ్ మూవీ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఈ మూవీలో స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ మరియు యాక్టర్ అయినటువంటి రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం హారర్ కం కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
లారెన్స్ గతంలో గంగ ,కాంచన లాంటి హారర్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న పి వాసుకి ఇది 65వ చిత్రం కావడం విశేషం.

ఈ చిత్రాన్ని వినాయక చవితికి గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు కాబట్టి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చంద్రముఖి మూవీ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పవచ్చు మరి ఇప్పుడు ఈ చిత్రంలో కూడా అదే రేంజ్ బ్యాక్ గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు.