Prabhas Chills With Charmee’s Pet Dog Husky In This Latest Picture

Charmme Kaur: Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇటలీలో షెడ్యూల్ పూర్తిచేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు ప్రభాస్. ఇటలీ షెడ్యూల్ పూర్తయిన విషయాన్ని పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా ఇటీవల వెల్లడించారు. త్వరలో రాధేశ్యామ్ హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ గ్యాప్ లో ఆదిపురుష్ కు సంబంధించిన చర్చల నిమిత్తం ప్రభాస్ ముంబయి వెళ్లబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే, ప్రభాస్ హైదరాబాద్ వచ్చిన విషయం పెద్దగా ఎవరికీ తెలీదు. తాజాగా ఛార్మి చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రభాస్ హైదరాబాద్‌లోనే ఉన్న విషయం అందరికీ తెలిసింది.

అయితే, ఛార్మి చేసిన పోస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఛార్మి వద్ద పెంపుడు శునకం ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఛార్మి దగ్గర ఆ శునకం వయసు 9 నెలలు. ఈ శునకాన్ని ఛార్మి సొంత కొడుకులా చూసుకుంటుంది. అందుకే, తన కొడుకుతో ప్రభాస్ కూర్చున్న ఫొటోను ఛార్మి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘నా 9 నెలల కొడుకుతో డార్లింగ్’’ అని క్యాప్షన్ పెట్టారు. దాంతో పాటు పూరి కనెక్ట్స్ ను కూడా ఈ ఫొటోకు ట్యాగ్ చేయడంతో ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూరి ఆఫీస్ లో ఉండి ఉంటాడా అంటూ కొందరు.. ప్రభాస్ ఛార్మి ఎక్కడ ఎందుకు కలిసి ఉంటారు అంటూ మరి కొందరు నెట్టింట ప్రచారం మొదలు పెట్టారు.

ఈ ఫొటోను చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. పూరి జగన్నాథ్ ఆఫీసుకు ప్రభాస్ రావడంతో ఆయనతో మళ్లీ సినిమా చేస్తున్నారా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. పూరి-ప్రభాస్ కాంబో సెట్ చేయండి మేడమ్ అంటూ ఛార్మిని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి, పూరి ఆఫీస్‌కు ప్రభాస్ ఎందుకెళ్లారో తెలీదు కానీ.. ప్రస్తుతం ఛార్మి పోస్ట్ వైరల్‌గా మారింది. త్వరలోనే వీరిద్దరి కాంబో మూవీ ఉంటుందేమో అంటూ ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు.