విచారణకు హాజరైన ఛార్మి..!

0
55
Tollywood Drug case Charmy Kaur attends ED investigation in drug case

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటి చార్మీ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్‌ సరఫరా చేసే కెల్విన్‌తో చార్మీ వాట్సాప్‌ చాటింగ్‌ చేసినట్లు సమాచారం. కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు చార్మీని ప్రశ్నించనున్నారు. 2015-17వరకు జరిగిన బ్యాంక్‌ లావాదేవీల వివారాలను వెంట తేవాలని ఈడీ నోటీసులో పేర్కొంది.

మంగళవారం (ఆగస్టు 31) రోజున ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ విచారణకు హాజరవ్వగా.. పలు కీలక విషయాలపై పది గంటలపాటు ఈడీ విచారించింది. హీరోయిన్‌గా గుడ్‌బై చెప్పిన చార్మీ ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి కో ప్రొడ్యూసర్ గా సినిమాలు తెరకెక్కిస్తుంది. మనీలాండరింగ్‌ కోణంలో.. ఆమె బ్యాంక్‌ ఖాతాలు, ప్రొడెక్షన్‌ హౌస్‌కు సంబంధించిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఛార్మిని ప్రశ్నించనున్నారని సమాచారం.

 

Previous articleTamannaah Bhatia Latest Stills
Next articleపవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” క్రేజీ అప్‌డేట్‌ అదుర్స్‌