Ram temple in Ayodhya demands ban on Adipurush: రిలీజ్ అయిన క్షణం నుంచి ఆదిపురుష్ చిత్రానికి ఏదో ఒక రూపంలో ట్రోలింగ్ గండం మాత్రం తప్పడం లేదు. అయితే నిన్నటి నుంచి మాత్రం ఈ మూవీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఏకంగా రామ జన్మస్థలమైనటువంటి అయోధ్య ఆలయ పూజారులు, అర్చకుల సంఘాలు , అయోధ్యలో ఉన్నటువంటి సాధువులు మరియు హనుమాన్ గర్హి ఆలయ పూజారి కలిసికట్టుగా ఆదిపురుష్ సినిమాపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Ram temple in Ayodhya demands ban on Adipurush: ఈ చిత్రంలో సీతారాములు మరియు హనుమంతుడి వేషధారణ చాలా అభ్యంతరకరంగా ఉంది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పిన” గుడ్డ నీ బాబుది …”డైలాగ్.. భక్తులను తీవ్రంగా నిరాశ పరుస్తోందని.. తక్షణమే ఈ సినిమాను నిషేధించాలని రామజన్మభూమి ప్రధాన పూజారి ఆయన ఆచార్య సత్యేంద్ర దాస్ డిమాండ్ చేస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో రాముడు , హనుమంతుడు మరియు రావణుడి పాత్రలను తమ ఇష్టానుసారంగా పూర్తిగా మార్చి చూపించడం జరిగిందని. ఇప్పటివరకు చదువుకున్న మరియు తెలిసిన రామాయణం పాత్రలకు వీటికి ఎక్కడ పొంతనలేదని. హనుమంతుడు చెప్పిన డైలాగ్స్ ఆయన పేరు ప్రతిష్టలను అవమానించే విధంగా ఉన్నాయని వెంటనే సినిమాను ఆపివేయాలని…హనుమాన్ గర్హి ఆలయ పూజారి అయిన రాజు దాస్ అన్నారు.
హిందూ మతాన్ని వక్రీకరించడం కోసమే బాలీవుడ్ తెగ తాపత్రయ పడుతోందని…ఎలాంటి శ్రద్ధ లేకుండా పురాణ పురుషుడు అయినటువంటి రాముడి మీద తీసిన ఈ సినిమా అందుకు నిదర్శనం అని ఆయన విమర్శించారు. మరోవైపు మధ్యప్రదేశ్ కు చెందిన క్షత్రియ కర్ని సేన..దర్శకుడు ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ హతమారుస్తామని ప్రకటించింది.

ఇప్పటికే ముంబైలో ఓం రౌత్ ను చంపడానికి ఒక బృందం ఏర్పాటు చేయడం జరిగిందని…వాళ్లకు ఆయుధాలు ఇచ్చి మరి…ఆ ఓం రైతుని వెతికి చంపవలసిందిగా చెబుతామని ధైర్యంగా మీడియా ముందే వాళ్ళు ప్రకటించారు. ఇప్పటికైనా ఆదిపురుష్ మూవీ టీం ఏదో ఒక రకంగా ప్రజల కోపాన్ని శాంత పరచకపోతే విషయాలు మరింత జటిలం అవుతాయి అనడానికి ఇదే నిదర్శనం.