మెగాస్టార్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ షూటింగ్ ప్రారంభం..!

289
Megastar’s 153 Project Launched with pooja ceremony

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మించనున్న మెగాస్టార్ 153వ చిత్రం బుధవారం ఉదయం ఫిలిం నగర్ సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది.

ఈ చిత్రానికి ‘తని వరువన్’ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ – అశ్వినీ దత్ – డీవీవీ దానయ్య – నిరంజన్ రెడ్డి – నాగబాబు కొరటాల శివ – జెమినీ కిరణ్ – రచయిత సత్యానంద్ మెహర్ రమేష్ – బాబీ – రామ్ ఆచంట – గోపి ఆచంట – మిర్యాల రవీందర్ రెడ్డి – నవీన్ యెర్నేని – శిరీష్ రెడ్డి – యూవి క్రియేషన్స్ విక్కీ తదితరులు హాజరయ్యారు.

Megastar Chiranjeevi’s project #153 was launched ceremoniously on Wednesday

ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ .. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసారు. మెగాస్టార్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా ఇది నిలుస్తుంది” అన్నారు .

ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా మాట్లాడుతూ- మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్ లో మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు.

ఈ చిత్రానికి సమర్పణ : సురేఖ కొణిదెల,
సంగీతం : ఎస్ ఎస్ తమన్,
కెమెరా : నీరవ్ షా,
రచయిత : లక్ష్మి భూపాల్.
ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్.
లైన్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావు.

నిర్మాతలు : ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్,
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : మోహన్ రాజా.