మార్చి 7 నుండి ఇల్లందులో ‘ఆచార్య’ షూటింగ్

0
457
chiranjeevi-acharya-shooting-at-khammam-iellandu
chiranjeevi-acharya-shooting-at-khammam-iellandu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్ ఇల్లందు జేకే మైన్స్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 7 నుండి 15వ తేదీ వరకు ఇల్లందు జేకే మైన్స్ ఓపెన్ కాస్ట్ మరియు అండర్ గ్రౌండ్ మైనింగ్ లో షూటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో చిత్ర హీరో చిరంజీవి, రాంచరణ్  పై సన్నివేశాలు నిర్వహించనున్నారు.

 

ఈ మేరకు అందుకు తగు అనుమతులు కల్పించాలని చిత్ర దర్శకుడు కొరటాల శివ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి పువ్వాడ చిత్ర షూటింగ్ కోసం స్థానికంగా అనుమతులతో పాటు చిత్ర హీరో చిరంజీవికి తానే తన నివాసంలో ఆతిధ్యం ఏర్పాటు చేస్తామని వారికి తెలిపారు.

 

 

మిగతా జిల్లాలతో పోల్చితే పర్యాటక రంగంగా ఉమ్మడి ఖమ్మం అభివృద్ధి చెందిందని, వివిధ చిత్రాల షూటింగ్ ల కోసం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో అనువైన ప్రదేశమని కొరటాల శివ పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఖమ్మం స్వరూపం పూర్తిగా మారిపోయిందని అందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.

Previous articleMalavika Mohanan hot photo shoot
Next articleసమీక్ష : ఉప్పెన