బిగ్‌బాస్ వేదికగా బిగ్ ఆఫర్లు పొందిన కంటెస్టెంట్లు..!

0
310
Chiranjeevi and Nagarjuna Special gift to Bigg Boss Telugu 4 contestants Divi and Mehaboob

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కార్యక్రమానికి సంబంధించి మరో అంకం ముగిసింది. కరోనా కోరలు చాచిన సమయంలో మొదలైన సీజన్ 4 కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. అభిజీత్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకోగా అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు. సింగరేణి ముద్దుబిడ్డ సోహైల్ మూడో స్థానంలో ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఎంటర్‌టైన్ అందించడమే కాదు కంటెస్టెంట్స్ ఆశయాలకు తమ మద్దతు పలికారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో తాము ముందుంటామని చిరు, నాగ్ మరోసారి నిరూపించారు.

ముందుగా మహర్షి ఫేం దివికి బంపర్ ఆఫర్ ఇచ్చారు చిరు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేయనున్నట్టు ప్రకటిస్తూ అందులో దివికి మంచి రోల్ ఇస్తామని హామీ ఇచ్చారు. మనం వేదాళం రీమేక్ చిత్రీకరణ సమయంలో కలుద్దాం అనే సరికి ఆ అమ్మడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.

Chiranjeevi and Nagarjuna offers to Bigg Boss contestants Divi and Mehaboob

బిగ్‌బాస్‌లో 3 పొజిషన్‌లో నిలిచిన సోహైల్‌ పంట పండిందనే చెప్పాలి. బిగ్‌బాస్ ఇంటి నుంచి సెకండ్ రన్నరప్‌గా వేదిక మీదకు వచ్చిన సోహైల్‌ను ఏం కావాలో కోరుకోమని అడిగారు చిరంజీవి. దానికి అతడు తను తీయబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావాలని చిరును ఆహ్వానించాడు. అయితే చిరంజీవి మాత్రం ఏకంగా అతడి సినిమాలో నటిస్తానని మాటిచ్చారు.అంతేకాకుండా ఆ సినిమా ప్రమోషన్ బాధ్యత కూడా తీసుకుంటానని అన్నారు.

 

ఇక మెహబూబ్ గురించి మాట్లాడిన చిరంజీవి.. నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్లుంది. సినిమాలోకి రావడానికి ఎంత తపన చెందానో అది నీలో కనిపిస్తుంది అని చిరు అన్నారు. ఈ సందర్భంగా నాగార్జున కలగజేసుకుని సోహైల్ గెలుచుకున్న డబ్బు గురించి ప్రస్తావించారు. ‘సోహైల్‌ అందుకున్న 25 లక్షల రూపాయల్లో అనాథశ్రమానికి రూ.5 లక్షలు మెహబూబ్ ఇంటి కోసం రూ.5 లక్షలు ఇస్తానన్నాడు. అయితే మెహబూబ్ మాత్రం దాన్ని తిరస్కరించాడు. తనకివ్వాలనుకున్నదాన్ని కూడా అనాథశ్రమానికి ఇచ్చేయమని సూచించాడు’ అని వివరించారు.

Chiranjeevi and Nagarjuna offers to Bigg Boss contestants Divi and Mehaboob

చిరు మనసు కరిగిపోయి వెంటనే పది లక్షల రూపాయల చెక్‌ని మెహబూబ్‌కి అందించాడు. ఆ సంతోషంతో కన్నీరు పెట్టుకుంటూ చిరు కాళ్ళపై పడ్డాడు మెహబూబ్. మెహబూబ్‌ని పైకి లేపిన చిరు ఆలింగనం చేసుకొని మీరు కళాకారులయ్యా.. కన్నీరు పెట్టకూడదు అని చెప్పారు. ఇక నాగార్జున కూడా తన పెద్ద మనసు చాటుకున్నాడు. తనకు వచ్చిన రూ. 25 లక్షలలో అనాథశ్రమానికి రూ.5 లక్షలు మెహబూబ్ ఇంటి కోసం రూ.5 లక్షలు ఇస్తాననడంతో అవి మీరు ఇంటికి తీసుకెళ్లండి. ఆ అనాథశ్రమానికి రూ. 10 లక్షలు నేనే ఇస్తానని చెప్పి వారి మనసులలో ఆనందం నింపారు.

 

Previous articleనిహారిక భర్త చైతన్య తెరంగేట్రం..?
Next article11 మిలియన్ల క్లబ్‌లోకి మహేష్‌ బాబు