ఆ స్పెషల్ రోజుపై కన్నేసిన ఆచార్య..!

0
1989
Chiranjeevi and Ram Charan Acharya will release in Diwali

Chiranjeevi Acharya Release Date: మెగాస్టార్ చిరంజీవి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు చిరు. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు.. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నాడు చిరు.

నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. చిరూ – చరణ్ ఇద్దరూ కూడా ఒక ఆశయం కోసం పోరాడే నక్సలైట్లుగా కనిపించనున్నారు. చరణ్ పోషించిన ‘సిద్ధా’ పాత్ర ఆయన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. గతంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇటీవల కోవిడ్ కేసులు తగ్గి.. థియేటర్లు తెరుచుకున్న ఆచార్య సినిమా నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. భారీ బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

Chiranjeevi and Ram Charan Acharya will release in Diwali

తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేడ్ ఒకటి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ కూడా పూర్తైన నేప‌థ్యంలో సినిమాని దీపావ‌ళికి విడుదల చేయ‌బోతున్న‌ట్టుగా తెలుస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్లోనే విడుదల చేయాలనే ఒక ఆలోచనలో మేకర్స్ ఉన్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సన్నహాలు కూడా చేస్తున్నారట.