ఫైనల్‌ షెడ్యూల్‌లో చిరంజీవి ‘Acharya’

0
45
Chiranjeevi and Ram Charan Start Shooting for the Final Schedule of Acharya film

Chiranjeevi Acharya: మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం `ఆచార్య‌ (Acharya)`.

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపిన యూనిట్‌.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పునః ప్రారంభించారు.

“రీసెంట్‌గా ‘ఆచార్య’ (Acharya) ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాం. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను తెలియజేస్తాం. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు, లాహే లాహే సాంగ్‌కు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది” ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ.. ‘ధర్మస్థలి తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి’ అని పేర్కొన్నారు.

Chiranjeevi Ram charan resume shoot of Acharya

ఈ సినిమాలో కామ్రేడ్ సిద్ధ అనే పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే చిరు కూడా ధర్మస్థలి సెట్స్ లో అడుగుపెడతారని తెలుస్తోంది.