Allu Arjun, Ram Charan, Chiranjeevi, Balakrishna And Mohan Babu Tributes On Jaya Prakash Reddy Death

Jaya Prakash Reddy Death: నేటి (మంగళవారం) ఉదయం కమెడియన్ కమ్ విలన్ జయప్రకాష్ రెడ్డి మరణవార్తతో టాలీవుడ్‌లో విషాదం అలుముకుంది. జయప్రకాష్ రెడ్డి ఇక లేరని తెలిసి షాకైంది సినీ లోకం. పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

జయప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మహేష్ బాబు, అలాగే సినీ ప్రముఖులు ట్వీట్స్ చేశారు.

వంటి ఎన్నో విభిన్న చిత్రాల్లో మేము కలిసి నటించాము. ఆయన రంగస్థలం నుండి వచ్చిన వారు కాబట్టి ఆయన సినిమా రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్ళు గా భావించేవారు. సినిమాల్లో ఎంత బిజీ గా ఉన్నా నాటకాలు ప్రదర్శించేవారు. మా ఇద్దరి మధ్యా ఎంతో విశిష్టమైన అనుబంధం ఉంది. ఆయన లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను” అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.