Homeసినిమా వార్తలుచిరంజీవి భోళా శంకర్ తో పోటీకి రజనీకాంత్ జైలర్.. రిలీజ్ డేట్ ఇదే

చిరంజీవి భోళా శంకర్ తో పోటీకి రజనీకాంత్ జైలర్.. రిలీజ్ డేట్ ఇదే

Chiranjeevi Bhola Shankar vs Rajinikanth Jailer: చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధమయ్యారు.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ వస్తున్న రజినీకాంత్ కొత్త సినిమా జైలర్ విడుదల తేదీని ఈరోజు ప్రకటించడం జరిగింది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి భోలా శంకర్ విడుదల తేదీని కూడా ప్రకటించారు.

Chiranjeevi Bhola Shankar vs Rajinikanth Jailer: యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న రజినీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10 నా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ఈరోజు ప్రకటించడం జరిగింది. జైలర్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించడానికి మేకర్స్ స్మాల్ వీడియోని కూడా విడుదల చేశారు. ఈ మూవీ రిలీజ్ విషయాన్ని సన్ పిక్చర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. జైలర్ (Jailer Movie) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోతో రజినీకాంత్ (Rajinikanth) ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ కి సినిమాపై భారీ గాని అంచనాలు పెరిగాయి.

మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి బోలా శంకర్ (Bhola Shankar) విడుదల తేదీని కొన్ని రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న బోలా శంకర్ సినిమాని ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ అలాగే తమన్నా కీలకమైన పాత్రలో చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీడియో అలాగే పోస్టర్లు సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నాయి.

Chiranjeevi Bhola Shankar vs Rajinikanth Jailer fight at August box office

అయితే ఇప్పుడు రజనీకాంత్ (Rajinikanth) అలాగే చిరంజీవి (Chiranjeevi) బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధం కావాల్సి వచ్చింది. ఒక రోజు తేడాతో విడుదలవుతున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. రజినీకాంత్ జైలర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంటే.. చిరంజీవి ఫ్యామిలీ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో ముందుకు వస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక సిద్దు జొన్నలగడ్డ సీక్వెల్ టిల్లు స్క్వేర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాని కూడా ఆగస్టు 11న రిలీజ్ సిద్ధం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఆగస్టు నెలలో ఈ నాలుగు సినిమాలలో ఏది బాక్సాఫీస్ విన్నర్ గా ముందుకు కొనసాగుతుందో చూడాలి..

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY