Homeసినిమా వార్తలుచిరంజీవి భోళా శంకర్ నుంచి అదిరిపోయే అప్ డేట్..!

చిరంజీవి భోళా శంకర్ నుంచి అదిరిపోయే అప్ డేట్..!

Chiranjeevi Bholaa Shankar Huge Interval Sequence Shoot Underway, Dubbing Begins, Bholaa Shankar shooting update, Bholaa Shankar shooting location, Bholaa Shankar shooting images

Bholaa Shankar Shooting Update: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ల క్రేజీ ప్రాజెక్ట్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 2023 క్రేజీయస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Bholaa Shankar Shooting Update: ప్రస్తుతం, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) షావర్ అలీ, వజ్ర & ఫైటర్స్, ఇతర ప్రముఖ తారాగణం షూటింగ్‌లో పాల్గొంటున్న భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. కాగా, మేకర్స్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు ఈరోజు ప్రారంభించారు. జూన్ చివరి నాటికి భోళా శంకర్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

Chiranjeevi Bholaa Shankar Dubbing works Begins

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ & యాక్షన్‌తో పాటు లావిష్ గా షూట్ చేసిన పాటలు ఉంటాయి. మెహర్ రమేష్ ఈ చిత్రంలో చిరంజీవిని (Chiranjeevi) పూర్తి స్టైలిష్ మాస్ అవతార్‌లో ప్రజంట్ చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్, చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఆగస్ట్ 15 (మంగళవారం) స్వాతంత్ర్య దినోత్సవం హాలిడే లాంగ్ వీకెండ్‌ కలిసోచ్చేలా ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆగస్ట్ 22న మెగా స్టార్ పుట్టినరోజు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY