Chiranjeevi Bholaa Shankar Update: మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటేనే టాలీవుడ్ లో డిఫరెంట్ క్రేజ్ ఉంది. ఆయన ఎన్ని సినిమాలు చేసినా అవి ఎంత సూపర్ హిట్ అయినా కొన్ని సినిమాలు మాత్రం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా చిరంజీవి నటించిన అన్నయ్య మరియు శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీస్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా శంకర్ దాదా ఎంబిబిఎస్ అయితే చిరంజీవిని డిఫరెంట్ కామెడీ యాంగిల్ లో చూపించింది.
Chiranjeevi Bholaa Shankar Update: ఈ చిత్రంలో చిరంజీవి కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ మరియు కామెడీ పంచ్ డైలాగ్స్.. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ల వర్షం కూడా కురిపించాయి. నిజానికి ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ స్టోరీ అంతా తెలిసినప్పటికీ కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు అని చెప్పవచ్చు.
ఆచార్య సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవి.. వాల్తేరు వీరయ్య సక్సెస్ తో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తమిళ్ మూవీ వేదాళం రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. భోళా శంకర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా మరియు కీర్తి సురేష్ లీడ్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా నటిస్తున్నారు మరియు వీరిద్దరి మధ్య మంచి సెంటిమెంట్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ కొత్త వార్త మెగా ఫాన్స్ ని ఖుష్ చేస్తుంది. ఈ మూవీలో శంకర్ దాదా టైప్లో చిరంజీవి కొన్ని సన్నివేశాల్లో సూపర్ కామెడీ చేస్తారట. ఆల్రెడీ చిత్రాన్ని నేటివిటీకి మరియు చిరంజీవి క్యారెక్టర్ కు తగిన విధంగా ఎన్నో మార్పులు చేయడం జరిగింది. బోలా శంకర్ లో చిరు కామెడీ టైమింగ్ క్లిక్ అయితే మాత్రం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ పుట్టించడం కన్ఫర్మ్.
Web Title: Chiranjeevi Bholaa Shankar Update. Bholaa Shankar music Update, Chiranjeevi latest movie shooting update, Bholaa Shankar first single, Bholaa Shankar shooting location, Bholaa Shankar release date,