చిరంజీవి ఆచార్య తర్వాతి సినిమా ఈ డైరెక్టర్‏తోనే..!

0
569
chiranjeevi clarifies the next movie with director bobby

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ ఫ్లో లో ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను చేస్తున్నాడు చిరంజీవి. ఈ చిత్రం ఏప్రిల్ లోనే చిత్రీకరణను పూర్తి చేసుకుని మే 13న విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత చిరు ‘లూసిఫర్’ రీమేక్‏లో నటించనున్నాడు. దీనిని మోహన్ రాజా డైరెక్షన్ చేయనున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉండగా…

ఈ రెండు ప్రాజెక్ట్స్ కాకుండా చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. శనివారం హైదరాబాద్‏లో జరిగిన ఉప్పెన మూవీ ప్రీరీలజ్ ఈవెంట్‏లో పాల్గొన్న చిరు ఈ విషయాన్ని చెప్పాడు. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో చిరంజీవి, బాబీ కాంబోలో సినిమా రాబోతుంది.

లూసిఫెర్ రీమేక్, ఆ తర్వాత వేదాళం రీమేక్, ఆ తర్వాత బాబీ సినిమాలను చేయనున్నాడు చిరంజీవి లైనప్ కన్ఫర్మ్ అయింది.

 

Previous articleKajal Aggarwal Photos
Next articleనా సినిమాలు చూడటానికి సిగ్గుపడుతుంటాను: సూర్య