GodFather Telugu Movie Review & Rating: 3.5/5
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరీ జగన్నాధ్, సత్య దేవ్, సముద్రఖని, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ
దర్శకత్వం : మోహన్ రాజా
నిర్మాతలు: రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్
సంగీతం: థమన్ ఎస్
GodFather Telugu Movie Review
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆచార్య సినిమా డిజాస్టర్ అయిన తర్వాత గాడ్ ఫాదర్ సినిమా తో మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ (GodFather) ట్రైలర్ అలాగే పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచే విధంగా చేశాయి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ మూవీ ఈ రోజు విడుదలైంది. ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..


కథ: చిరంజీవి గాడ్ ఫాదర్ (GodFather Review) లూసీఫర్ కి రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మ (చిరంజీవి) తక్కువ సమయంలోనే రాష్ట్రంలో బలమైన వ్యక్తిగా ఎదుగుతాడు. ముఖ్యమంత్రి పీకే రామదాస్ (సర్వదమన్ బెనర్జీ) ఆకస్మిక మరణం రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం సృష్టిస్తుంది.
హోం మంత్రి వర్మ (మురళీ శర్మ) మరియు PKR అల్లుడు జయదేవ్ (సత్యదేవ్) వారి మార్గాల్లో రాష్ట్రానికి సీఎం కావాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. మొత్తానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అనే నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బ్రహ్మ ఏం చేశాడు ?, అసలు బ్రహ్మ ఎవరు ?, గాడ్ ఫాదర్ గా అతని గత జీవితం ఏమిటి?. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Chiranjeevi GodFather Review In Telugu
ప్లస్ పాయింట్స్:
కథాకథనాలు
మెయిన్ క్యారెక్టర్స్ నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
క్లైమాక్స్
తార్ మార్ సాంగ్
సాంకేతిక విభాగం: మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్, ఒరిజినల్ సినిమా లూసీఫర్ కి రీమేక్ అని తెలిసిన విషయమే. ఈ సినిమాలో కథకు సంబంధించి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయబడ్డాయి. ఈ విధానంలో మోహన్ రాజా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. తను చేసిన మార్పులు సినిమాకి చాలా ప్లస్ పాయింట్ గా మారాయి.


అయితే, మంచి కంటెంట్ తీసుకున్నా దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల స్లోగా సాగుతుంది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన సంగీతం నాట్ బ్యాడ్ అని చెప్పాలి. టీజర్ విడుదలైన టైం లోనే థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై ట్రోల్ నడిచాయి. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు : మోహన్లాల్ లూసిఫర్ రీమేక్ గా వచ్చిన గాడ్ ఫాదర్ పొలిటికల్ డ్రామా బాగానే ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. నయనతార, సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ప్లస్ అయ్యారు. కానీ కొన్ని చోట్ల స్లో నేరేషన్, బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.
ఓవరాల్ గా ఈ పొలిటికల్ డ్రామాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫుల్ మెగా ఫీస్ట్ ఎంటర్ టైనర్ లాంటిది. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.