Chiranjeevi GodFather Digital Rights: మెగాస్టార్ చిరంజీవి రాబోయే సినిమా గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ అలాగే పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొద్ది రోజుల క్రితమే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు గాడ్ఫాదర్ డిజిటల్ రైట్స్ సంబంధించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరంజీవి గాడ్ ఫాదర్ విడుదల కాకముందే సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ (GodFather OTT Rights) నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేయడం జరిగింది. గాడ్ ఫాదర్ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ కి ఏకంగా రూ.57 కోట్లు నెట్ ఫ్లిక్స్ (Netflix OTT) చేసిందని సమాచారం. అయితే గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఇంతవరకు ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయలేదు మేకర్స్.
Chiranjeevi GodFather OTT Rights Acquired By Netflix
దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ (GodFather) కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తుంది. పొలిటికల్ డ్రామా గా వస్తున్న ఈ సినిమా లో సత్యదేవ్ అలాగే నయనతార కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో మమ్ముట్టి నటించిన లూసిఫర్ సినిమాకి రీమేక్ గా వస్తుంది ఈ గాడ్ పాదర్.
అభిమానుల కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి స్థలం స్టేజ్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రీ రిలీజ్ డేట్ మాత్రమే ఖరారు చేయాల్సి ఉంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా డిజిటల్ రైట్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.