Homeసినిమా వార్తలుGodFather Trailer: మోస్ట్ డేంజర్ మ్యాన్ గా మెగాస్టార్..!

GodFather Trailer: మోస్ట్ డేంజర్ మ్యాన్ గా మెగాస్టార్..!

Chiranjeevi GodFather Trailer: మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న సినిమా గాడ్‌ఫాదర్‌. చిరంజీవి, సత్యదేవ్ అలాగే నయనతార ప్రధాన పాత్రలో వస్తున్నా గాడ్‌ఫాదర్‌ సినిమా అక్టోబర్ 5న విడుదలకు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 28న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గాడ్‌ఫాదర్‌ ట్రైలర్‌ ని విడుదల చేయడం జరిగింది.

ఇప్పటికే విడుదలైన గాడ్‌ఫాదర్‌ టీజర్ అలాగే సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మోస్ట్ డేంజర్ అండ్ మిస్టీరియస్ మ్యాన్ గా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ట్రైలర్ (GodFather Trailer) చూస్తే అర్థమవుతుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి లో ఉన్న మనిషి మరణిస్తే ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో గాడ్ ఫాదర్ ట్రైలర్ (GodFather Trailer) లో చూపించారు. పొలిటికల్ డ్రామా గా వస్తున్నా గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మరింత అంచనాలు భారీగా పెంచేసింది.

ముఖ్యమంత్రి పీఠం కోసం జరిగే త్రిముఖ పోరులో ఓవైపు మెగాస్టార్‌, మరోవైపు నయనతార, ఇంకోవైపు సత్యదేవ్‌లు పోటీ పడుతున్నట్టు ఈ ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్లు (GodFather Trailer) చిరంజీవి లుక్కు అలాగే గ్రేస్ అన్ని సినిమాలకీ డిఫరెంట్ గా ఉండటం ఆకర్షణీయంగా మారింది.

ఇక గాడ్‌ఫాదర్ ట్రైలర్‌లో సల్మాన్ స్పెషల్‌ అప్పియరెన్స్‌ను కూడా పవర్‌ఫుల్‌గా చూపించారు. ఇది నీ సమస్య కాదు.. నా సమస్య కాదు.. ఫ్యామిలీ సమస్య.. ఇది నీ పెద్దన్నకు పెద్దన్న అయిన గాడ్‌ఫాదర్‌ సమస్య అనే డైలాగ్‌తో సల్మాన్‌ ఎంట్రీ ఇస్తాడు.

ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు నీరవ్ షా కెమెరా పనితనం దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలుగు హిందీ భాషల్లో విజయదశమి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. గాడ్‌ఫాదర్‌ ట్రైలర్ (GodFather Trailer) గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. 

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles