దయనీయ స్థితిలో పావలా శ్యామలకు.. చిరు సాయం

Chiranjeevi: Pavala Syamala: పావలా శ్యామల ‘ఆంధ్రావాలా’, ‘గోలీమార్’ లాంటి కొన్ని సినిమాల్లో ఆమె చేసిన కామెడీని అంత సులువుగా మరిచిపోలేం. ఐతే అనారోగ్యం, ఇతర కారణాలతో శ్యామల కొన్నేళ్ల నుంచి సినిమాల్లో కనిపించడం లేదు. నటి పావలా శ్యామలకు అండగా నిలుస్తూ ఆర్ధిక సాయం చేశారు చిరంజీవి.

ఇటీవలే మరణించిన నటుడు, జర్నలిస్ట్ TNR కుటుంబానికి తనవంతు సాయం చేసిన మెగాస్టార్.. తాజాగా నటి పావలా శ్యామలకు అండగా నిలుస్తూ ఆర్ధిక సాయం చేశారు. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పావలా శ్యామల ఈ క‌ష్ట‌కాలంలో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలుసుకున్న చిరంజీవి.. ఆమెకు 1,01,500 రూపాయలతో ‘మా’ సభ్యత్వం ఇప్పించి, ప్రతి నెలా ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేశారు.

Read Also: ఆసక్తిరేపుతున్నరమ్యకృష్ణ ఫస్ట్‌లుక్ పోస్టర్

గతంలో కూడా చిరంజీవి గారు 2 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేశారని చెప్పుకొచ్చారు పావలా శ్యామల. ఇప్పుడు ఈ క‌ష్టంలో మ‌రోసారి సాయపడిన వారికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటానని తెలుపుతూ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు పావలా శ్యామల. శ్యామల పరిస్థితి తెలుసుకుని నటి కరాటే కళ్యాణి ఆమె ఇంటికి వెళ్లి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించడంతో పాటు తన పరిస్థితి మీడియా దృష్టికి తెచ్చారు.

Read Also:  Chiranjeevi sets up helpline no and urges fans to donate plasma 

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles