Chiranjeevi Imitates Rajasekhar Bholaa Shankar Trailer: మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి కొత్త సినిమా భోళా శంకర్. ఈ సినిమాని ఆగష్టు 11న విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. దర్శకుడు మెహర్ రమేష్ ఇప్పటికే ప్రమోషన్స్ ని మొదలుపెట్టి సినిమాకు సంబంధించిన సాంగ్స్, పోస్టర్, టీజర్ అలాగే రీసెంట్ గా భోళా శంకర్ ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది.
Chiranjeevi Imitates Rajasekhar Bholaa Shankar Trailer: అయితే రీసెంట్ గా విడుదలైన భోళా శంకర్ ట్రైలర్లో చిరంజీవి మాస్, ఎమోషన్స్ అలాగే తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టడం జరిగింది. దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఫాన్స్ కి ఎటువంటి ట్రీట్ కావాలో ఈ ట్రైలర్ ద్వారా ఇచ్చారు. ఇక విషయంలోకి వెళ్తే, ఈ ట్రైలర్ లో చిరంజీవి చేసిన చిన్న కామెడీ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరేదో కాదు అది రాజశేఖర్ మార్క్ స్టెప్ చిరంజీవి చేయడం జరిగింది.
దీంతో రాజశేఖర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. రాజశేఖర్ అనగానే మొదటిగా గుర్తుకు వచ్చేది తన డాన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు చిరంజీవి కూడా భోళా శంకర్ ట్రైలర్ లో అదే మార్క్ స్టెప్ ని ఇమిటేట్ చేయటం జరిగింది. ఇది గమనించిన మెగా ఫాన్స్ ఆ వీడియోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. వాస్తవానికి ఆ వీడియో చూస్తే ఒక కామెడీ సీన్లు చిరంజీవి రాజశేఖర్ ఎలా చేతులు చూపిస్తూ చేస్తారు అదేవిధంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది.

గతంలో కూడా పవన్ కళ్యాణ్ చాలాసార్లు తన సినిమాల్లో రాజశేఖర్ లాగా ఇమిటేట్ చేస్తూ డైలాగ్స్ చెప్పడం జరిగింది. అది జరిగిన మొదటిలో జీవిత రాజశేఖర్ అసహనం కూడా వ్యక్తం చేసారు . మరి ఇప్పుడు చిరంజీవి చేసిన దానికి ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో చూడాలి. కొన్ని రోజుల క్రితమే జీవిత రాజశేఖర్ కి సంవత్సరం పాటు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అది కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల అల్లు అరవింద్ పరువు నష్టం కేసు వేయడం తెలిసిందే. మొత్తం మీద చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పుడు ఈ వీడియోని సోషల్ మీడియాలో అయితే ఫ్రెండ్ గా మార్చారు.