ఎట్టకేలకు ‘ఆచార్య’ సెట్లోకి బాస్ ఈజ్ బ్యాక్!

0
341
Chiranjeevi is finally back on the sets of Acharya shooting

Acharya Shooting: మెగాస్టార్ చిరంజీవి, అజేయ దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక సినిమా ‘ఆచార్య’. దేవాలయ భూముల స్కామ్ నేపథ్యంలో యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – రామ్ చరణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా, మణిశర్మ స్వరాలు కూర్చుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కు.. కరోనా మహమ్మారి వల్ల ఏడునెలల పాటు బ్రేకులు పడ్డాయి.

ఇటీవల ‘ఆచార్య’ మూవీ చిత్రీకరణ పునఃప్రారంభమైంది. అయితే చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో .. హోమ్ క్వారంటైన్ కు వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెగెటివ్ అని తేలడంతో యూనిట్ బృందం ఊపిరిపీల్చుకున్నారు. ఈ క్రమంలో ‘ఆచార్య’ షూటింగ్ కూడా ఇటీవలే తిరిగి ప్రారంభించారు. తాజాగా మెగాస్టార్ కూడా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ చిరులేని ఇతర ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరించాడు దర్శకుడు.

అయితే తాజాగా మెగాస్టార్ కూడా ‘ఆచార్య’ సెట్స్ లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. హైద్రాబాద్ లోని కోకాపేట్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ప్రస్తుతం ఆచార్య షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి పాల్గొనే ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలతో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. 2021 సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఆచార్య మూవీలో రామ్ చరణ్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. మరి ‘ఆచార్య’ మూవీ మెగాస్టార్ద కు ఏ రేంజ్ క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here