అభిమానులకి షాక్ ఇచ్చిన ‘చిరు 152’ యూనిట్..!

Chiranjeevi koratala next chiru152 team responds on rumors
Chiranjeevi koratala next chiru152 team responds on rumors

(Chiranjeevi koratala next chiru152 team responds on rumors.. koratala team respond on mohan babu role..Chiru 152 movie latest updates) మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మోహన్ బాబును సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరూ కలిసి ‘బిల్లా రంగా’ ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ ‘చక్రవర్తి’ వంటి చిత్రాల్లో హీరోలుగా నటించారు..ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని ఇటు మెగా అభిమానులు కూడా సంబరపడిపోయారు.

అయితే ఈ వార్తలో వాస్తవం లేదట. ‘మెగాస్టార్ 152’ చిత్రం యూనిట్ సభ్యులు తెలియజేసారు. ‘మోహన్ బాబు గారి రేంజ్ కు సరిపడా పాత్ర మా చిత్రంలో లేదు. ఉంది ఉంటే కచ్చితంగా మేమే తెలియజేసేవాళ్ళం. దయచేసి ఆ వార్తలను నమ్మొద్దు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా పై ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఫస్ట్ షెడ్యూల్ లో కొరటాల కొన్ని ఎమోషనల్ సీన్స్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయట. ఈ చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి మూడు ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.