మెగాస్టార్ కోసం రంగం సిద్ధం చేస్తోన్న కొరటాల !

chiranjeevi koratala siva Movie Latest Updates
chiranjeevi koratala siva Movie Latest Updates

స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోంది. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదట. వచ్చే నెల రెండో వారంలో ఈ సినిమాకి సంబధించి ఆడిషన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మెగాస్టార్ కోసం కొరటాల రంగం సిద్ధం చేస్తోన్నాడు. అలాగే ఇప్పటికే చిరు లుక్ కి సంబంధించి ఇటీవలే ఓ టెస్ట్ షూట్ కూడా చేశారట. సినిమాలో మెగాస్టార్ గెటప్ ను కొరటాల కాస్త కొత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట.

మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది. ఇక డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. తన సినిమాల అన్నిటిలో మంచి మెసేజ్ కూడా ఉండేలా చూసుకుంటాడు కొరటాల. మెగాస్టార్, ప్రస్తుతం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని విడుదల చేసే పనిలో ఉన్నారు.