భవదీయుడు డైలాగ్‌ని లీక్ చేసిన మెగాస్టార్..!!

మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ ప్రస్తుతం కొత్త చిత్రం ఆచార్య ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే శుక్రవారం విడుదలవుతోంది. ప్రమోషన్ లో భాగంగా వివిధ మీడియా ఛానల్స్ కి డైరెక్టర్ తో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్. దీనిలో భాగం గానే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఆర్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది.

Harish Next Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh dialogue Leaked
Harish Next Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh dialogue Leaked

హరీష్ శంకర్ చేస్తున్న ఆచార్య ఇంటర్వ్యూలో రామ్ చరణ్ అలాగే కొరటాల శివ తో మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమా డైలాగ్ గురించి చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఈ డైలాగు అలాగే వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

చిరంజీవి మాట్లాడుతూ “హరీష్ తన సినిమాలోని డైలాగ్ చాలా బాగుంది” అని చెప్పగా, “అవును, అది భవదీయుడు భగత్ సింగ్ నుండి” అని హరీష్ వెంటనే చెప్పాడు. చిరంజీవి ఆ డైలాగ్‌ని బయటపెట్టాలని పట్టుబట్టి, ఫన్నీ నోట్‌లో అది మెగా లీక్ అవుతుందని హరీష్ అన్నారు. దానికి చిరు నవ్వుతూ, “అవును, లీక్ చేద్దాం” అన్నాడు.

ఈ సందర్భంగా వచ్చే డైలాగ్ ఇలా ఉంటుందని తెలిపారు. ‘మొన్న వీడు మన ఇంటికొచ్చి, పెద్దగా అరిచినప్పుడు, అసలు ఎంట్రా వీడి ధైర్యం అని అనుకున్నా.. ఇప్పుడు అర్థమైంది. వీడు నడిస్తే వెనకాల లక్షమంది నడుస్తున్నారు. బహూశా ఇదే ఇతని ధైర్యమేమో. లేదు సార్.. ఆ లక్షలాది మందికే ఆయన ముందుండి నడుస్తున్నాడన్నదే ధైర్యం..’ అనే మాస్ డైలాగ్ ను పవన్ కోసం హరీశ్ శంకర్ రాశాడట. ఇదే డైలాగ్ ను ఇంటర్వ్యూలో చిరంజీవి కూడా చెప్పి అదరగొట్టాడు.

Bhavadeeyudu Bhagat Singh dialogue leaked
Bhavadeeyudu Bhagat Singh dialogue leaked

పవర్ ఫుల్ లైన్‌తో వచ్చినందుకు హరీష్‌ను మరోసారి అభినందించారు. భవదీయుడు భగత్ సింగ్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం. ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే ఫాలోవర్స్ ను ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ డైలాగుతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి, ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

- Advertisement -

 

Web Title: Chiranjeevi leaked Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh dialogue, Harish Next Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh dialogue Leaked, Bhavadeeyudu Bhagat Singh dialogue leaked

Related Articles

Telugu Articles

Movie Articles