చిరు కోసం వినాయక్ మాస్టర్ ప్లాన్

chiranjeevi lucifer: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ చిత్ర రీమేక్ బాధ్యతలను యంగ్ డైరెక్టర్, ‘సాహో’ ఫేమ్ సుజీత్‌కు అప్పగించారు. అయితే, సుజీత్ చేసిన మార్పులు చిరంజీవికి నచ్చలేదని, దీంతో ఆయన ఈ రీమేక్‌ను వి.వి.వినాయక్‌ చేతిలో పెట్టారని వార్తలు వచ్చాయి.

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం వి.వి.వినాయక్ ఇంకా స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేయలేదు. మలయాళం స్క్రిప్ట్‌లో పెద్దగా మార్పులు ఏమీ చేయకుండానే ఒక మంచి కమర్షియల్ సినిమాలా దీన్ని మలిచేందుకు వినాయక్ చూస్తున్నారట. చిరంజీవికి హీరోయిన్‌ను పెట్టడం, అలాగే సాంగ్స్ కూడా జతచేయాలని వినాయక్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. నిజానికి మలయాళం వర్షన్‌లో మోహన్‌లాల్‌కు హీరోయిన్ లేదు. అలాగే, పాటలు కూడా లేవు.

ఈ పొలిటికల్ డ్రామాలో హీరోయిన్‌ను, పాటలను చొప్పించాలని వినాయక్ చూస్తున్నారని అంటున్నారు. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యమవుతోందని టాక్. ‘లూసిఫర్’ రీమేక్ ఆలస్యం అవుతుండటంతో మెహర్ రమేష్ సినిమాను చిరంజీవి ముందుకు తీసుకొచ్చారని సమాచారం. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తికాగానే మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమాను చిరు మొదలుపెడతారు. ఇక ‘లూసిఫర్’ రీమేక్ 2021 ద్వితీయార్ధంలో ప్రారంభమవుతుందని టాక్.

Related Articles

Telugu Articles

Movie Articles