చిరంజీవి, మెహర్ రమేష్ సినిమా అఫీషియల్ ప్రకటన..!

0
535
pawan kalayn confirmed chiranjeevi meher ramesh movie

చిరంజీవి (Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ (Acharya) సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు చిరంజీవి.. మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో ఒక యాక్షన్ స్టైలిష్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

చిరంజీవి పుట్టినరోజుకు ప్రకటన వస్తుందని అనుకున్నారు. కానీ చిరు-మెహర్ రమేష్ కాంబినేషన్ పై ప్రకటన రాలేదు. అయితే మెహర్ రమేష్ మాత్రం, ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేస్తానంటున్నాడు. మూడేళ్లుగా దానికోసమే కష్టపడుతున్నానని ప్రకటించాడు. పుట్టినరోజు నాడు పవన్ ను విష్ చేశాడు మెహర్. “వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలంటూ ” 2 ఫొటోలు కూడా పెట్టాడు. దానికి ఈరోజు రిప్లయ్ ఇచ్చారు పవన్. తనకు శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్ చెబుతూనే.. చిరంజీవితో చేయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇక మెహర్ రమేష్.. చిరంజీవికి కజిన్ వరుస అవుతాడు. ఇక చిరంజీవిని స్టోరీతో మెప్పించడం అంతా ఈజీ కాదు. మరి మెహర్ రమేష్ ఏం చెప్పి.. చిరంజీవిని ఓకే అనిపించాడా అనేది ఇప్పటికీ సస్పెన్సే. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే పవన్ ఇలా అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు.