పవన్‌ సినిమాకు చిరంజీవి టైటిల్!

Pawan Kalyan PSPK30 Title:  పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా మారుతున్నారు. ఇప్పటికీ పింక్ రీమేక్‌లో నటిస్తున్న ఆయన మరో మూడు సినిమాలను లైన్లో పెట్టారు. దసరా సందర్భంగా పవన్‌ కొత్త సినిమాపై షాకింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్. దీంతో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ మల్లూ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనమ్ కోషియం` రీమేక్ లో పోలీస్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో దగ్గుబాటి రానా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 1982లో చిరంజీవి, మోహన్‌బాబు కాంబినేషన్లో వచ్చిన ‘బిల్లా రంగా’ టైటిల్‌ను ఇందుకోసం పరిశీలిస్తున్న సమాచారం. ఇప్పటికే రానాను దర్శకనిర్మాతలు సంప్రదించారట. అయితే అధికారికంగా ప్రతిదీ చిత్రబృందం వెల్లడించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. మే 2021 లో విడుదల చేయాలన్నది ప్లాన్.

Related Articles

Telugu Articles

Movie Articles