chiranjeevi participated samantha samjam show aha ott app

టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని సమంత వ్యాఖ్యాతగా ‘సామ్‌ జామ్‌’ అనే కార్యక్రమంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆహా’ యాప్ తన సబ్‌స్క్రైబర్లను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా సమంతతో ఈ షో చేయిస్తోంది. తెలుగు ఓటీటీ ఆహా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు మరియు టాక్ షోలతో హోరెత్తిస్తోంది. దీనిలో భాగంగా ప్రముఖ సినీ సెలబ్రెటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో టాక్ షో లు వచ్చాయి. సమంత టాక్ షో చాలా విభిన్నంగా ఉంటుందంటూ అల్లు అరవింద్ మీడియా సమావేశం సందర్బంగా చెప్పాడు.

నవంబర్ 13న ఈ షో ప్రారంభం కాగా.. తొలి అతిథిగా విజయ్ దేవరకొండ వచ్చారు. తర్వాత వచ్చే ఎపిసోడ్లతో తమన్నా, రష్మిక మందానా, అల్లు అర్జున్ తదితరులు గెస్ట్‌లుగా ఈ షోలో సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి ఎపిసోడ్ ఫీడ్ బ్యాక్ తీసుకున్న సామ్ జామ్ ప్రోగ్రాం టీమ్ రెండవ ఎపిసోడ్ చిరంజీవితో ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

అనుకున్నట్లుగానే మెగాస్టార్‌ ఈ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోల ట్విటర్ వైరల్‌గా మారాయి. ఆహాలో స్ట్రీమింగ్ కు రెడీ అయిన చిరంజీవి సామ్ జామ్ ఎపిసోడ్ పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మొదటి ఎపిసోడ్ పై పెదవి విరిచిన ప్రేక్షకులు మెగా ఎపిసోడ్ తో అయినా ఆహా అంటారా అనేది ఆసక్తికరంగా మారింది. చిరు ఎపిసోడ్ త్వరలోనే ‘ఆహా’లో ప్రసారం కానుంది. సమంత ఏయే ప్రశ్నలు అడిగిందో.. వాటికి మెగాస్టార్ ఏ సమాధానాలు చెప్పారో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.