Homeసినిమా వార్తలుఆరుపదుల వయసులో కూడా తగ్గేదే లేదు అంటున్న స్టార్ హీరోలు.!!

ఆరుపదుల వయసులో కూడా తగ్గేదే లేదు అంటున్న స్టార్ హీరోలు.!!

Chiranjeevi, Rajinikanth, Kamal Haasan and Balakrshna upcoming movies, bhagavath kesari shooting update, Bholaa Shankar release date, Jailer release date, Indian 2 shooting update.

తరం మారే కొద్ది…. వయసు పెరిగే కొద్దీ…హీరోలకు కాస్త డిమాండ్ తగ్గుతుంది. మొదట్లో హీరో క్యారెక్టర్లు చేసిన వారు కూడా తరువాత బాబాయి మరియు తండ్రి క్యారెక్టర్స్ తో అడ్జస్ట్ అయిపోతారు. అయితే ప్రస్తుతం ఆరు పదులు వయసు దాటుతున్న ఈ నలుగురు హీరోలు మాత్రం కుర్ర హీరోలతో కూడా పోటీ పడుతూ తగ్గేదే లేదు అని వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.

రజినీకాంత్ ,కమల్ హాసన్ ,చిరంజీవి మరియు బాలకృష్ణ…సినీ ఇండస్ట్రీ గుర్తుపెట్టుకో తగిన లెజెండరీ యాక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నలుగురు హీరోలు మంచి హిట్ మూవీస్ తో దూసుకు వెళ్తున్నారు. మహేష్ బాబు ,రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి కుర్ర హీరోలు సైతం వీళ్ళ వేగాన్ని అందుకోలేకపోతున్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. సీనియారిటీ పెరిగే కొద్దీ వేగాన్ని పెంచడమే కాకుండా చిత్రాలను ,డైరెక్టర్లను వరుసగా లైనప్ లో పెడుతున్నారు ఈ అగ్ర నాయకులు.

ఆచార్యతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవి గాడ్ ఫాదర్ గా కూడా మెప్పించలేకపోయాడు. కానీ మొన్న సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య తో గ్రాండ్ సక్సెస్ సంపాదించి వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు. ఈ ఆగస్టు 11న భోళాశంకర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధ ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాలు చిరంజీవి లైన్ అప్ లో ఉన్నాయి.

అఖండ మూవీ తర్వాత బాలయ్య జోరు అన్ స్టాపబుల్ అని చెప్పవచ్చు. మొన్న సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి వీరవిహారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రేపు దసరాకు అదే జోరుతో..భగవంత్ కేసరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీటితోపాటు ఇంకో రెండు సినిమాలు బాలయ్య లైనప్పులో ఉన్నాయి.

Chiranjeevi, Rajinikanth, Kamal Haasan and Balakrshna upcoming movies

మరోపక్క రజనీకాంత్ జైలర్ మరియు లాల్ సలాం సినిమాలు చేస్తున్నారు. రెండు చిత్రాల షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావస్తోంది. ఈ నేపథ్యంలో జ్ఞానవేల్, లోకేష్ కనగరాజ్ లాంటి స్టార్ డైరెక్టర్ రజిని మూవీ కోసం క్యూ కట్టి ఉన్నారు. ఇక విక్రమ్ సక్సెస్ తర్వాత కమల్ హాసన్ కూడా తన జోరుని బాగా పెంచారు.ఇండియన్-2` మూవీ తర్వాత వినోద్ మరియు మణిరత్నం కమల్ తో మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే విక్రమ్ 2 మూవీ కూడా లైనప్ లో ఉంది. ఇలా ఈ ఆరు ప్రజల అందగాళ్ళు వరుస చిత్రాలతో బిజీగా ఉండడమే కాకుండా కుర్ర హీరోలకు తమ సక్సెస్ తో సవాల్ విసురుతున్నారు.

Web Title: Chiranjeevi, Rajinikanth, Kamal Haasan and Balakrshna upcoming movies, bhagavath kesari shooting update, Bholaa Shankar release date, Jailer release date, Indian 2 shooting update.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY