నువ్వు బాగుండాలబ్బా అంటూ ఫోటో పెట్టిన మెగా స్టార్.. రామ్ చరణ్ ఏమన్నాడంటే..?

452
Chiranjeevi Birthday wishes to Allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు పలువురు సెలెబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి మొదట ఉన్నారు. అల్లు అర్జున్ చిన్నప్పటి ఫోటోను అప్లోడ్ చేసి.. బన్నీ డాన్సు లోని గ్రేస్ ను పొగుడుతూ.. చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “Dance లో grace, ఆ వయస్సు నుంచే ఉంది. Bunnyలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. Happy Birthday Bunny! నువ్వు బాగుండాలబ్బా..” అంటూ పోస్టు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

రామ్ చరణ్ తేజ్ కూడా బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మామూలుగా అయితే ఈరోజు కేక్ తినిపిస్తూ ఉండేవాన్ని.. అది వీలుపడకపోవడంతో చిన్ననాటి జ్ఞాపకాలతో నీ పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుందామని అన్నాడు రామ్ చరణ్ తేజ్. చిన్నప్పుడు కేక్ తినిపిస్తున్న ఫోటోను అప్లోడ్ చేశాడు రామ్ చరణ్. అలాగే పుష్ప పోస్టర్ బాగుందని మెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సినిమా పేరు ‘పుష్ప’.. అలాగే గుబురు గడ్డంతో.. తీక్షణమైన చూపుతో అల్లు అర్జున్ చాలా రఫ్ గా కనిపిస్తూ ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను అయిదు భాషల్లో విడుదల చేయాలని భావిస్తోంది.