ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం మర్చిపోయాయి

Chiranjeevi: వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి గారు. ప్రస్తుతం ఆచార్య సినిమా కంప్లీట్ చేసుకున్న చిరంజీవి గారు, ఇప్పుడు బోలా శంకర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ లో పాల్గొన్నారు. ఈ అవార్డ్స్ పై చిరంజీవి మరోసారి రెండు తెలుగు ప్రభుత్వాలపై వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి మాట్లాడుతూ, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వము సినిమా రంగానికి సంబంధించి నంది అవార్డు ఇచ్చేవారు, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల విడిపోయిన తర్వాత రెండు సంవత్సరాలుగా నంది అవార్డులు ప్రకటించారు అలాగే కరోనా కారణంగా వాటి గురించి మనం మర్చిపోయావు. అని చెప్పుకొచ్చారు.

ఇకపై అయినా ఈ రెండు ప్రభుత్వాలు అలోచించి అవార్డు వేడుకలు నిర్వహిస్తే మంచిది, అన్నారు. కళాకారులకి అవార్డులు గొప్ప ఉత్సాహాన్నిస్తాయి. ప్రభుత్వాలు సినిమా కళాకారులకి అవార్డులు అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అవార్డుల ఫంక్షన్ ని నిర్వహిస్తాయేమో చూడాలి.

 

Related Articles

Telugu Articles

Movie Articles