Chiranjeevi Comments On Thaman Speech: తెలుగు సినిమాలు ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా అద్భుతాలు సాధిస్తున్నాయనేది అందరికీ తెలిసిందే. కానీ అదే సమయంలో మన తెలుగు ఆడియెన్స్‌లో కొంతమంది వారి చర్యల ద్వారా మన సినిమాలకు నష్టం చేస్తుండటమనే వాస్తవాన్ని కొట్టిపారేయలేం. ఇటీవల కాలంలో కొన్ని పెద్ద సినిమాలు అనూహ్యమైన నెగటివిటీకి గురవుతున్నాయి, ముఖ్యంగా సోషల్ మీడియాలో.
సినిమా చూసి మాట్లాడుతున్నారో, చూడకుండానే కామెంట్ చేస్తున్నారో తెలియదు. అయితే చాలా సందర్భాల్లో పెద్ద స్టార్స్ సినిమాలకు సంబంధించి ఇదే దృశ్యం కనిపిస్తోంది. అసలు సినిమాను చూడకుండానే, తప్పుడు ప్రచారం ద్వారా నెగటివిటీ స్ప్రెడ్ చేస్తూ, సాధారణ ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నారు. దీని వల్ల ఆ సినిమాను తీశిన చిత్రబృందం చేసిన కష్టం వృథా అవుతోంది.
సినిమా మెరుగు లేకపోతే ఆ నెగటివిటీ ఓ మామూలు విషయమే. కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా ఈ విధమైన ప్రవర్తన అందరికీ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇది ఇటీవల “గేమ్ ఛేంజర్” (Game Changer) చిత్రానికి సంభవించిన సంగతి. సినిమా విడుదల కాకముందే వచ్చిన నెగిటివిటీపై సంగీత దర్శకుడు థమన్ (Thaman) చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
తమన్ (Thaman) చేసిన కామెంట్స్ పై చిరంజీవి (Chiranjeevi) కూడా స్పందించడం అనేది ఇపుడు మరింత ఆసక్తిగా మారింది. “నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది. “