Megastar Chiranjeevi Sye Raa Narsimha Reddy is getting awesome response in advance booking at the USA box office
Megastar Chiranjeevi Sye Raa Narsimha Reddy is getting awesome response in advance booking at the USA box office

హిస్టారికల్ హిట్.. ఎమోషనల్ ట్రీట్ అంటూ కీర్తించబడుతున్న ‘సైరా’ పరిస్థితి ‘పైన పటారం.. లోన లొటారం’ సామెత మాదిరిగా తయారయింది. ఒకపక్క ఇండస్ట్రీ నుంచి సినీ ప్రముఖులంతా ‘సైరా’ అద్భుతమైన సినిమా.. హృదయాన్ని కరిగించిన సినిమా.. గొప్ప దేశభక్తిని చాటిన సినిమా అని విశేషంగా పొగుడుతుంటే… మరోపక్క కలెక్షన్స్ విషయంలో మాత్రం బాక్సాఫీస్ వద్ద ‘సైరా’ అప్పుడే నీరసించి పోయి టాక్ కు తగ్గట్టు కలెక్షన్స్ ను రాబట్టలేక చతికలపడ్డాడు. తాజాగా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సైరా కలెక్షన్స్ ఏపిలో దాదాపు 30 % తగ్గిపోయాయి. ఇటు నైజాంలో ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దసరా సెలవులు కలిసొచ్చాయి అనుకుంటే.. తీరా మూడో రోజుకే కలెక్షన్స్ పడిపోవడం బయ్యర్లను ఆందోళనలోకి నెట్టేస్తోంది. ‘బుక్ మై షో’లో అడ్వాన్స్ బుకింగ్స్ చూసినా ‘సైరా’ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

అయితే శనివారం నుండి మళ్లీ కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా సైరా, బాహుబలి దరిదాపుల్లోకి కూడా చేరేలా కనిపించడం లేదు. కనీసం ఇటీవలే రిలీజ్ అయి ప్లాప్ టాక్ తెచ్చుకున్న సాహో రాబట్టిన కలెక్షన్స్ నైనా.. ‘సైరా’ రాబట్టేలా నమ్మకం కలిగించడం లేదు. మొత్తానికి సూపర్ హిట్ టాక్ సాధించినప్పటికీ ‘సైరా’, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో.. ప్రధానంగా పిల్లలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. మరి రానున్న రోజుల్లో ‘సైరా’ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.