Chiranjeevi Sye Raa Music Director Change,Release Date,Cast
Chiranjeevi Sye Raa Music Director Change,Release Date,Cast

సైరా సినిమా పూర్తయిపోయింది.సినిమాపై టీమ్ అంతా సంతృప్తికరంగా ఉన్నా ఇంకా సినిమా ప్రమోషన్స్ మొదలుకాకపోవడంతో ఫ్యాన్స్ మాత్రం ఆందోళనపడుతున్నారు.అయితే సైరా టీమ్ మాత్రం దీనికి పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.ముందుగా ముంబై లో ఈ సినిమాకి సంబందించిన భారీ ఈవెంట్ ద్వారా సైరా ని నేషనల్ ఇమేజ్ ఉన్న ప్రాజెక్ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది సినిమా టీమ్.

ఈ ఈవెంట్ లో చిరంజీవి,అమితాబ్ తో పాటు విజయ్ సేతుపతి కూడా పాల్గొంటారు అని టాక్ నడుస్తుంది.అందుకే నేషనల్ మీడియా అటెన్షన్ మొత్తం ఉండే ఈ ఈవెంట్ ద్వారా సాహో టీజర్ ని రిలీజ్ చేసి ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టాలి అనేది ఆ సినిమా టీమ్ మైండ్ లో ఉన్న స్ట్రాటజీ.తమిళ్ లో నయనతార,విజయ్ సేతుపతి ల ప్రెజెన్స్ సినిమాకి కావాల్సిన క్రేజ్ తీసుకువస్తుంది.కన్నడలో భారీ ఫాలోయింగ్ ఉన్న సుదీప్ ఎటూ ఉన్నాడు.సినిమాలో సరయిన కంటెంట్ ఉంటే ఇదంతా అసలు మ్యాటర్ కానీ కాదు.కానీ సినిమాపై ఎంత నమ్మకం ఉన్నా కూడా అప్రోచ్ అవ్వాల్సిన విధానం కూడా కరెక్ట్ గా ఉండాలి అని ఇంతలా ఆలోచిస్తున్నారు.స్లో అండ్ స్టడీ అన్నట్టుగా సాగుతున్న సైరా రిలీజ్ నాటికి ఫుల్ బజ్ గెయిన్ చేసేలా పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడు రామ్ చరణ్.