Megastar Chiranjeevi Sye Raa Narsimha Reddy is getting awesome response in advance booking at the USA box office
Megastar Chiranjeevi Sye Raa Narsimha Reddy is getting awesome response in advance booking at the USA box office

తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వచ్చిన ‘సైరా’ నిన్న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా నెల్లూరు జిల్లాలో మెగాస్టార్ కి మంచి మార్కెట్ ఉంది. ఈ జిల్లాలో వసూళ్ల పరంగా మెగాస్టార్ సినిమాలు ఎప్పుడూ నిరుత్సాహా పరచలేదు. ఇక్కడ మెగాస్టార్ సినిమాలు రికార్డ్ కలెక్షన్లను కురిపిస్తాయి. తాజాగా ‘సైరా’ కూడా నెల్లూరులో మొదటిరోజు అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలిరోజు ఈ చిత్రం నెల్లూరు జిల్లాలో రూ.2.09 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది.

కాగా ఈ సినిమా యొక్క జిల్లా హక్కులు రూ.4.80 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ భారీ మొత్తాన్ని రికవర్ చేయడం కొంచెం కష్టమేనని అనుకున్నారంతా. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే సులభమే అనిపిస్తోంది. ఇక చిత్రానికి పాజిటివ్ టాక్ ఉండటంతో వర్కింగ్ డేస్ అయినా కూడా వసూళ్లు బలంగానే ఉన్న వసూళ్లు వీకెండ్ సెలవుల్లో ఇంకాస్త మెరుగుపడే అవకాశం ఉంది. మొత్తానికి నెల్లూరులో సైరా దూసుకుపోతున్నాడు.

ఇప్పటికే సైరాని చూసిన అభిమానులు ప్రేక్షకులు ‘సైరా’ సినిమా గురించి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ‘సైరా’ ‘అవుట్ స్టాండింగ్’గా అని.. అద్భుతమైన పీరియాడిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని.. దర్శకుడు సురేందర్‌ రెడ్డి సినిమాని చాల గొప్పగా తెరకెక్కించాడని.. చిరంజీవి అద్భుతమైన నటనతో హృదయాలను కదిలించేలా నటించారని పోస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ‘సైరా’ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించడం ఖాయం అంటున్నారు.