Chiranjeevi Sye Raa Strong Challenge From hrithik War Movie
Chiranjeevi Sye Raa Strong Challenge From hrithik War Movie

చిరంజీవి హీరోగా,రామ్ చరణ్ నిర్మాతగా 200 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సైరా..నర్సింహారెడ్డి.టాలీవుడ్ లో ఇలాంటి ప్రతిష్టాత్మక సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు వాటికి సోలో ఛాన్స్ ఇచ్చేయడం అనే ఆనవాయితీ నడుస్తుంది.అందుకే ముందుగా దసరా కి అనుకున్న బన్నీ-త్రివిక్రమ్ ల సినిమాని భారీ పోటీ ఉన్నా కూడా సంక్రాంతికే దింపుతున్నారు. అలా అక్టోబర్ 2 కి సైరా రిలీజ్ అని ఇంటర్నల్ గా అందరికి స్ట్రాంగ్ గా హింట్ ఇచ్చేసాడు చెర్రీ.అందుకే టీమ్ అంతా పడుతూ,లేస్తూ పనులు పూర్తిచేస్తున్నారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

సైరా సోలోగా వస్తుంది కాబట్టి సక్సెస్ బోర్డర్ దాటేస్తుంది అని ధీమాగా ఉన్నారు అంతా.కానీ ఇప్పుడు వార్ రూంపంలో స్ట్రాంగ్ అప్పోనెంట్ పొజిషన్ లోకి వచ్చింది.పైగా హ్రితిక్,టైగర్ ష్రాఫ్ ఇద్దరు హీరోలు ఉన్నారు.ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరస్ గా ఉండబోతుంది.ఇప్పటికే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తో భంగపడిన యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అందుకే ఆదిత్య చోప్రా సైతం రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉండి వర్క్ చేసాడు.వార్ సినిమా టీసర్ తోనే బాలీవుడ్ లో భారీ హైప్ తెచ్చేసుకుంది.సైరా లో కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంది అని చెబుతున్నా,ఆ సినిమా నుండి ఇప్పటివరకు బయటికి వచ్చిన ఏ మెటీరియల్ కూడా ఆ సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ తీసుకురాలేకపోయింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

సైరా సేఫ్ అవ్వాలి అంటే బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్,టు వీక్స్ స్ట్రాంగ్ రన్ అనేది కీలకం.మరి వార్ కూడా అదే టైం కి వస్తే పేట్రియాటిక్ కంటెంట్ కి ఎడ్జ్ ఉన్నా ఒక్క అమితాబ్ వల్లే సైరా కి టాక్ దక్కాలి.ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వార్ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.క్రిష్ సిరీస్ వల్ల హ్రితిక్ కి ఇక్కడ కాస్త క్రేజ్ ఏర్పడింది.పైగా అది పండగ సీజన్,మాస్ సినిమా….టికెట్ కౌంటర్ దగ్గర ఎంతోకొంత ఆ సినిమా షేర్ చేసుకుంటుంది.అందుకే సైరా అక్టోబర్ 2 కి వస్తే మాత్రం ఫస్ట్ షో పడి టాక్ వచ్చేదాకా ప్రొడ్యూసర్స్ కి టెన్షన్ తప్పదు.అది కాదు అనుకుంటే మళ్ళీ అలాంటి మరో మంచి డేట్ దొరకదు.మరి ఏం చేస్తారో చూడాలి?.

[INSERT_ELEMENTOR id=”3574″]