chiranjeevi Sye Raa Team Learn Lessons from Saaho
chiranjeevi Sye Raa Team Learn Lessons from Saaho

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న చిత్రం ‘సైరా’. కాగా ఇప్పటికే ‘సైరా’ కోసం మెగా టీమ్ భారీ ప్రమోషన్లను ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే భారీగా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న ఘనంగా నిర్వహించింది.

అయితే కొన్ని రోజుల క్రితం భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సాహో’ ప్లాప్ తో సరిపెట్టుకుంది. మొత్తానికి సాహో పూర్తిస్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. దాంతో బలమైన ఓపెనింగ్స్ వచ్చినా.. ఆ తరువాత లాంగ్ రన్ వసూళ్ల మీద సినిమా టాక్ బాగానే ఎఫెక్ట్ చూపింది. దీంతో ‘సైరా’ టీం ‘సాహో’ విషయంలో జరిగిన పొరపాటును తమ సినిమా విషయంలో జరగకూడదని అన్ని అంశాలను పలుసార్లు చెక్ చేసుకుంటున్నారట. ముఖ్యంగా ఫస్ట్ డేట్ నాడు ఎలాంటి బ్యాడ్ టాక్ రాకుండా రివ్యూస్ లాంటిని మ్యానేజ్ చేయాలని చూస్తున్నారట. ఏమైనా సైరాకి సాహో బాగానే పాఠం నేర్పింది.

కాగా సైరా అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మెగా అభిమానులు మరియు మెగాస్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు సినిమాను మరింతగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. మిగిలిన భాషల్లోకి కూడా సినిమా బాగా వెళ్తుంది. అమితాబ్ బచ్చన్ మరియు చిరంజీవిల కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమాకి హిందీలో కూడా బాగానే బజ్ క్రియేట్ అయింది. సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తుండటంతో సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా మరో సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు.