satellite and digital rights Chiranjeevi Sye Raa Teaser Review
Chiranjeevi Sye Raa Teaser Review

తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినిమా లవర్స్ అంతా ఎదురుచూస్తున్నభారీ బడ్జెట్ సినిమా సైరా.ఈ సినిమాని రామ్ చరణ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించాడు అనేది తెలిసిన విషయమే.అయితే ఇప్పుడు ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.బాలీవుడ్ లో ఒక పెద్ద ఈవెంట్ పెట్టి మరీ ఆ టీజర్ ని రిలీజ్ చేశారు.మరి ఆ టీజర్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.

నిమిషం 45 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ లో ఫస్ట్ ఫ్రేమ్ నుండి కూడా గ్రాండియర్ అనేది మాత్రం ఎక్కడా తగ్గలేదు.అయితే ఈటీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అనుకున్న పవన్ కళ్యాణ్ వాయిస్ మాత్రం అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు.కానీ సినిమాకి కీలకమయిన యుద్ధానికి సంబందించిన విజువల్స్ మాత్రం పాన్ ఇండియా సినిమా అనే రేంజ్ కి ఎక్కడా తగ్గలేదు.వారియర్ గా చిరు లుక్ కూడా బావుంది.ఇక ఈ సినిమాలో ఉన్న భారీ కాస్ట్ అందరికి ఒక్కో షాట్ చొప్పున కనిపించే అవకాశం ఇచ్చారు.రామ్ చరణ్ పెట్టిన పెట్టుబడి స్క్రీన్ పై కనిపించేలా కష్టపడ్డాడు సురేందర్ రెడ్డి.ఈ సినిమాలో అందరి కంటే ఎక్కువగా స్టంట్ మాస్టర్స్ చేసిన హార్డ్ వర్క్ ఆకట్టుకుంటుంది.

హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ సైరా కి ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి.రత్నవేలు సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది.ఇక బాలీవుడ్ గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది అందించిన మ్యూజిక్ కూడా గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది.ఓవర్ ఆల్ గా సినిమా టీమ్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ వ్యూ లో రిలీజ్ చేసిన సైరా టీజర్ ఆ మేరకు ఆశించిన అప్లాజ్ దక్కించుకుంది.ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుంది అనేది అక్టోబర్ 2 న తెలుస్తుంది.

Click here for Teaser