మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ నుండి వినాయక్ ఔట్..?

0
344
Chiranjeevi to replace VV Vinayak with Harish Shankar for Lucifer Remake

మలయాళంలో మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరోతో తెరకెక్కిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్లుగా చాలా మార్పులు చేయాల్సి ఉంది. సుజీత్ దర్శకత్వంలో ఆ రీమేక్ చేయాలని మొదట భావించారు. కాని ఆయన స్క్రిప్ట్ విషయంలో నిరాశ పర్చడంతో ప్రకటించకుండానే పక్కకు పెట్టేశారు అంటూ పుకార్లు షికార్లు వచ్చాయి. తర్వాత ఈ ప్రాజెక్టు వినాయక్‌ దగ్గర ఆగింది. అసలే వరుస ఫ్లాపులతో ఉన్న వినాయక్‌కు ఈ మెగా ఆఫర్ ఓ వరంలా దొరికిందని అందరూ అనుకున్నారు.

దర్శకుడు వినాయక్ కూడా దాదాపు మూడు నాలుగు నెలల పాటు స్క్రిప్ట్ కోసం సిట్టింగ్స్ వేశారు. ప్రముఖ రచయితలు దర్శకులు కలిసినా కూడా స్ర్కిప్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దాంతో ఇప్పుడు మరో దర్శకుడు ఆ రీమేక్ కోసం పరిశీలించబడుతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కారణాలు బయటికి రాకపోయినా ఈ సినిమా నుంచి వినాయక్ తప్పుకోవడం నిజమేనని మాత్రం పక్కాగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు హరీష్ శంకర్ పేరు తెరమీదికి వచ్చింది.

మెగా హీరోలు పవన్‌తో ‘గబ్బర్ సింగ్’, వరుణ్ తేజ్‌తో ‘గద్దలకొండ గణేష్’ లాంటి బ్లాక్‌బస్టర్లు తీసిన హరీష్ శంకర్ అయితే తన సినిమాకు న్యాయం చేస్తాడని చిరంజీవి ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు లూసీఫర్ రీమేక్ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయంలో కొందరు ఉన్నారు. ఆ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హరీష్‌ శంకర్.. పవన్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆయన ‘వకీల్ సాబ్’, క్రిష్ సినిమాతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో నటించాల్సింది. ఇవన్నీ పూర్తయ్యే సరికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న హరీష్‌ శంకర్‌కు చిరంజీవి బంపరాఫర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.