Chiranjeevi-Trivikram Srinivas movie shooting starts from January 2020
Chiranjeevi-Trivikram Srinivas movie shooting starts from January 2020

మెగాస్టార్ చిరు అభిమానుల ఊహల్లోని డ్రీమ్ కాంబినేషన్లలో త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఒకటి. ఎప్పటికైనా గురూజీతో చిరు సినిమా చేస్తే చూడాలనేది వారి కోరిక. ఆ కోరిక త్వరలోనే తీరేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవికి త్రివిక్రమ్ గతంలో ఒక లైన్ చెప్పాడని, ప్రస్తుతం ఆ లైన్ మీద త్రివిక్రమ్ వర్క చేస్తున్నాడని ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా వంద శాతం ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే. ఇక హాస్యాన్ని పండించడంలో చిరు నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఎంటెర్టైనర్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికే థ్రిల్ అనిపిస్తోంది. ఇకపోతే చిరు తన తర్వాతి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేవాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట.

ఇక రామ్ చరణ్ కు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్, రూ.100 కోట్ల షేర్ రికార్డ్ నెలకొల్పిన ‘రంగస్థలం’ను అందించాడు సుకుమార్. చిరు సైతం సుకుమార్ పనితనానికి ఫిదా అయ్యారు. అందుకే 153వ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఆయనకేనాని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి మెగాస్టార్ ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ ను సెట్ చేస్తున్నాడుగా.