Chiranjeevi Tweet About rajasekhar health condition due to corona Possitive

Chiranjeevi-Rajasekhar: షూటింగ్స్ నిమిత్తం సెట్స్ పైకి వస్తున్న పలువురు సినీ నటులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ సహా.. ఆయన ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడింది. అయితే వారి కుమార్తెలు శివాత్మిక, శివానీ వెంటనే కోలుకోగా.. రాజశేఖర్, జీవిత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే రాజశేఖర్ పరిస్థితి కాస్త విషమంగా ఉందని తెలియడంతో సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు.

ఇదే విషయంపై తాజాగా హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక ఓ ట్వీట్ కూడా చేసింది. తన తండ్రి త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటూ.. అభిమానులందరిని ప్రార్థన చేయమని కోరింది. శివాత్మిక ట్వీట్ చూసిన చిరంజీవి ఆమె పెట్టిన ట్వీట్ రీ ట్వీట్ చేస్తూ ధైర్యం చెప్పారు. డియర్ శివాత్మిక.. మీ తండ్రి, నా సహచరుడు, స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయనకు, మీ కుటుంబానికి మా ప్రార్థనలు తోడుంటాయి.. ధైర్యంగా ఉండమని పేర్కొన్నారు.