Sye Raa Trailer, Sye Raa Narasimha Reddy Movie, Chiranjeevi, Latest Movie News
Sye Raa Trailer, Sye Raa Narasimha Reddy Movie, Chiranjeevi, Latest Movie News

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ కోసం మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా నిన్న ఈ సినిమా నుండి ‘సైరా ట్రైలర్’ను రిలీజ్ చేసింది చిత్రబృందం. చాల గ్రాండ్ గా ఉన్న ఈ ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ ట్రైలర్ అన్ని భాషలలో కలుపుకుని కేవలం 24 గంటల్లో ఏకంగా 34 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను సాధించింది. కాగా ప్రముఖ ప్రొడక్షన్ హౌస్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలకు సంబంధించి తమిళంలో విస్తృతమైన ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు. తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి సైరాలో కీలక పాత్రలో నటించడంతో.. తమిళంలో కూడా సైరా పై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. మొత్తానికి ఈ సినిమా సరి కొత్త రికార్డ్ లు సృష్టించడం ఖాయంలా కనిపిస్తోంది.