చిరు వేదాళం రీమేక్‌కు షూటింగ్ డేట్ ఫిక్స్..?

0
254
chiranjeevi vedalam remake will start on 16 november

chiranjeevi: Vedalam Telugu Remake: మెగాస్టార్ చిరంజీవి ఎనిమిది నెలల తర్వాత ఈనెల 9వ తారీకు నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఆచార్య సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు అధికారికంగా డేట్ కన్ఫర్మ్ చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి ‘ఆచార్య’ సెట్‌లో ఆయన అడుగు పెట్టనున్నారు. డిసెంబర్ ఆఖరికల్లా సినిమా షూటింగ్‌ పూర్తిచేయాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. దీంతో మిగిలిన షూటింగ్ ని ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయాలని యూనిట్ భావిస్తోంది. ఆచార్య షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిరు 153 వేదాళం రీమేక్‌ సినిమాను మొదలు పెట్టబోతున్నారు. దీనికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. నటీ నటుల ఎంపికపై దర్శకుడు మెహర్ రమేష్ దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు కీర్తి ఓకే చెప్పేసినట్లు వార్తలొచ్చినా యూనిట్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయ్యింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక మరియు లొకేషన్స్ కు సంబంధించిన విషయాలపై చర్చ జరుగుతోంది. సంక్రాంతి తర్వాతి నుంచి షూటింగ్ ప్రారంభిచేలా ప్లాన్ చేసుకోవాలని మెహర్ రమేష్‌కి చిరు సూచించారట.