Chiranjeevi ‘లూసిఫర్’ రీమేక్ కు టైటిల్ అదేనా?

0
108
Chiranjeevi's Lucifer remake gets a stunning title

Chiranjeevi’s Lucifer: చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ ను చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా.. మన నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దాడట దర్శకుడు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా తమన్‌ను చిత్ర బృందం ఎంపిక చేసింది. కాగా, ఇప్పుడు టైటిల్‌ను కూడా ఖరారు చేసే పనిలో ఉన్నారు దర్శకుడు మోహన్‌రాజా.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా ‘వీరయ్య’ అలాగే  ‘రారాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.  ‘లూసిఫర్’ కథాంశం ప్రకారం ఇది పొలిటికల్ థ్రిల్లరే అయినా.. హీరో పాత్ర కు రాజకీయాలకు అసలేమాత్రం సంబంధం ఉండదు. ఒక విధంగా ఆయనది పొలిటికల్ కింగ్ మేకర్ అన్నమాట. 

ఈ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సత్యదేవ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా ఓకే చెప్పినట్లు సమాచారం. ‘ఆచార్య’ షూట్‌ పూర్తయిన వెంటనే చిరు ఈ సినిమా చిత్రీకరణ పాల్గొంటారు.